విశ్వక్ సేన్ “అశోకవనంలో అర్జున కళ్యాణం” రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Apr 17, 2022 1:30 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం తన తదుపరి దాస్ కా ధమ్కీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు, అశోక వనంలో అర్జున కళ్యాణం అనే మరో సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈరోజు, రొమాంటిక్ కామెడీ చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6, 2022న థియేటర్లలో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.

ఈ విషయాన్ని ప్రకటించేందుకు సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రుక్సర్ ధిల్లాన్ విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌ పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :