ఫస్ట్ డే అద్దిరిపొయే వసూళ్లను రాబట్టిన “దాస్ కా ధమ్కీ”

ఫస్ట్ డే అద్దిరిపొయే వసూళ్లను రాబట్టిన “దాస్ కా ధమ్కీ”

Published on Mar 23, 2023 1:05 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం మొదటి రోజు అద్దిరిపొయే వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 8.88 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అయితే హీరో విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఇది మొదటి రోజు అత్యధిక వసూళ్లు కావడం విశేషం.

చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ లపై నిర్మించిన ఈ చిత్రానికి హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం లో హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్, అజయ్, అక్షర గౌడ, రావు రమేష్, రోహిణి లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు