సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ “ధమ్కీ”

Published on Mar 9, 2023 7:24 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ ధమ్కీ మార్చి 22, 2023న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని సెన్సార్ బోర్డ్ నుండి యూ/ఎ సర్టిఫికేట్ పొందింది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో మేకర్స్ అదే పొందుపరిచారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి మరియు పృథ్వీరాజ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వక్సేన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :