సరికొత్త లుక్‌లోకి మారిపోయిన విశ్వక్ సేన్..!

Published on Sep 4, 2021 10:46 pm IST


యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నట్టిస్తున్న తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు.

అయితే టీజర్‌ను చూస్తుంటే విశ్వక్ సేన్‌కి 30 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కాలేదని తెలుస్తుంది. అయితే పెళ్లి చేసుకునేందుకు తనకు ఓ మంచి అమ్మాయిని చూడాలని, తనకు పెద్దగా పట్టింపులు, కట్నం వంటి డిమాండ్లు కూడా ఏమీ లేవని విశ్వక్ చెప్పడం ఆకట్టుకుంది. అయితే తన ఫుల్ బయోడేటాతో ఓ మ్యారేజ్ బ్యూరోని కూడా సంప్రదిచాడు. అయితే ఇప్పటికవరకు గడ్డంతో కాస్త రఫ్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్‌ని మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :