విశ్వక్ సేన్ సరికొత్త మూవీ కి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Mar 15, 2022 1:32 pm IST

విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం లో విశ్వక్ సేన్ అర్జున్ కుమార్ అల్లం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్సర్ దిల్లాన్ నటిస్తుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణ లో SVCC డిజిటల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని బాపినీడు మరియు సుధీర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఏప్రిల్ 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :