విశ్వక్‌సేన్‌కి పిల్ల దొరికేసింది.. ఎవరో తెలుసా?

Published on Jan 15, 2022 9:04 pm IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చింతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న విభిన్న కథా చిత్రం ”అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ వడ్డీ వ్యాపారిగా అల్లం అర్జున్ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ కథకు తగినట్లుగా విభిన్నంగా ప్రమోట్ చేస్తూ అప్డేట్స్‌ని ఇస్తున్న చిత్ర యూనిట్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని ఇచ్చారు.

ఇటీవల మీకెవరికైనా పెళ్లి కూతురు దొరికితే చెప్పండి అంటూ పోస్ట్ పెట్టిన అల్లం అర్జున్‌కి పిల్ల దొరికేసింది. పిల్ల దొరికేసింది అంటూ ఓ వీడియో ద్వారా హీరోయిన్‌ ఎవరో చూపించారు మేకర్స్‌. ఇందులో పసుపులేటి మాధవిగా రుక్సార్‌ దిల్లాన్‌ అలరించనుంది. ఈ బ్యూటీ కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :