బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సూర్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని చాలా మంది ఎదురు చూసారు.

అయితే మాస్ అయినా క్లాస్ అయినా సూర్యకి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ చూపిస్తుంది. కేవలం రెండే రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ ఖరారు చేశారు. దీనితో సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

ఇక ఈ ఆదివారం వసూళ్లు కూడా మరో 50 కోట్ల గ్రాస్ వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఈజీగా ఈ సినిమా 150 కోట్ల మార్క్ ని దాటేస్తుంది. ఇక ఫైనల్ రన్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.

Exit mobile version