విశ్వరూపం-2 టీజర్ వచ్చేస్తోంది !


విశ్వరూపం- 2 చిత్రం చాలా కాలం పాటు ముందుకు సాగలేదు. ఈ ఏడాది ఎలాగైనా ఆ చిత్రాన్ని పూర్తి చేయాలని కమల్ నిర్ణయించుకున్నారు. కమల్ హాసన్ దర్శకత్వంలోనే ఈ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. విశ్వరూపం- 2 కోసం ఎదురుచూస్తున్న కమల్ అభిమానులకు ఇది శుభవార్త. ఈ చిత్ర టీజర్ ని రంజాన్ సందర్భంగా జూన్ 23 న విడుదల చేయనున్నారు.

కమల్ హాసన్ ఈ చిత్రంలో గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. పూజా కుమార్, రాహుల్ బోస్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విశ్వరూపం- 2 చిత్రం అక్టోబర్ లో ప్రేక్షుకుల ముందు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.