రిపబ్లిక్ డేకు రానున్న కమల్ సినిమా !
Published on Nov 29, 2017 10:27 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ చేస్తున్న చిత్రాల్లో ‘విశ్వరూపం 2’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. చెన్నైలో జరుగుతున్న షెడ్యూల్ తో ఈ చిత్రీకరణ పూర్తికానుంది. ఈ షెడ్యూల్లో కమల్ హాసన్ పై ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ చాన్నాళ్ల క్రితమే ప్రారంభమై ఈమధ్యే ఊపందుకున్న ఈ సినిమాను కమల్ స్వయంగా చిత్రీకరిస్తున్నారు.

2013 లో వచ్చిన ‘విశ్వరూపం’ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం కోసం దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే అనగా జనవరి 26న విడుదలచేయాలని భావిస్తున్నారట కమల్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాహుల్ బోస్, ఆండ్రియా, పూజ కుమార్ నటిస్తున్నారు.

 
Like us on Facebook