“మెకానిక్ రాకీ” థియేట్రికల్ రైట్స్ పై విశ్వక్ కామెంట్స్!

“మెకానిక్ రాకీ” థియేట్రికల్ రైట్స్ పై విశ్వక్ కామెంట్స్!

Published on Jun 12, 2024 8:31 PM IST

టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చివరిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కనిపించాడు. ఇది దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. తదుపరి దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రం కి సంబందించిన థియేట్రికల్ రైట్స్ విషయం పై హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

మెకానిక్ రాకీ చిత్రంను తెలుగు రాష్టాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి 8 కోట్లకు నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ లెక్కన ఆసియన్ సురేష్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై విశ్వక్ ఇలా రెస్పాండ్ అయ్యారు. “గాడిద గుడ్డు ఎం కాదు. జీఎస్టీ అంట. టీ షాప్ ముచ్చట్లు తీస్కోచ్చి ట్వీటర్ లో పెట్టొద్దు ప్రియాజీ. మెకానిక్ రాకీ ఇంకా విక్రయించబడలేదు. వాస్తవాలను సరిగ్గా పొందండి. ఇది టీమ్స్ కెరీర్” అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరితో హీరోయిన్ గా నటిస్తుండగా, జేక్స్ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు