“ముఖచిత్రం” సినిమాలో పవర్ఫుల్ వకీల్ గా మాస్ కా దాస్.!

Published on Mar 29, 2022 10:00 am IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి తాను కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

డిఫరెంట్ కథాంశంతో రూపొందిన “ముఖచిత్రం” సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేశారు యువ హీరో విశ్వక్ సేన్. ఇవాళ విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఇందులో తాను పవర్ ఫుల్ వకీల్ గా విశ్వామిత్ర పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు.

విశ్వక్ సేన్ కు “ముఖచిత్రం” టీమ్ పుట్టినరోజు విశెస్ తెలిపింది. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ప్రెజెంట్ చేయగా..ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్ రివీల్ తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తున్నది. మూవీ టీమ్ లో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో “ముఖచిత్రం” సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ముఖచిత్రం” త్వరలో విడుదలకు రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :