యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్

యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్

Published on Nov 18, 2022 8:00 PM IST

టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నివేత పేతురాజ్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ధమ్కీ. విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. క్రైమ్ డ్రామా మూవీగా రూపొందిన ధమ్కీ, ఐదేళ్ల క్రితం మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న అంగమాలి డైరీస్ కి రీమేక్ గా రూపొందింది. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని నిన్న రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేసారు.

హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ లో జరిగిన ధమ్కీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలకృష్ణ, ట్రైలర్ ఎంతో బాగుందని, మూవీ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని యూనిట్ కి ముందస్తు అభినందనలు తెలియచేశారు. ఇక ట్రైలర్ ని పరిశీలిస్తే ఆకట్టుకునే యాక్షన్, ఫైట్స్, థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానంగా బాగుండడంతో పాటు ఆడియన్స్ కి మూవీ పై మరింతగా హైప్ ని ఏర్పరిచాయి. ఇక ట్రైలర్ లో విశ్వక్ సేన్ లుక్స్, యాక్టింగ్ కూడా బాగుంది. మొత్తంగా ధమ్కీ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 2023లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు