పిల్లను వెతికి పెట్టండి అంటున్న విశ్వక్ సేన్..ఇంకా రెండు రోజులే..!

Published on Jan 12, 2022 7:02 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది పాగల్ చిత్రం తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న విశ్వక్, మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ మన ముందుకు రానున్నారు. విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ చిన్న దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరొక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇంకా రెండు రోజులే ఉంది, పిల్లని వెతికి పెట్టండి, లేదా కనీసం పడేయటానికి టిప్స్ అయినా ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు. తన బయోడేటా తో పాటుగా ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. హెల్ప్ అల్లం. ఫైండ్ పెళ్ళాం హ్యాష్ ట్యాగ్ ను జత చేయడం జరిగింది. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. SVCC డిజిటల్ బ్యానర్ పై ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :