మోషన్ పోస్టర్ తో విశ్వక్ కొత్త సినిమా టైటిల్ రివీల్.!

Published on Nov 9, 2021 9:21 pm IST

టాలీవుడ్ యూత్ లో మంచి ఇంపాక్ట్ కల్పించిన కొత్తతరం యంగ్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మంచి లైనప్ తో విజయాలు అందుకుంటున్న విశ్వక్ ఇప్పుడు తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేసాడు. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా “ఓ మై కడవులే” సినిమాకి రీమేక్ గా చేసిన ఈ చిత్రంపై డిజైన్ చేసిన ఈ మోషన్ పోస్టర్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

దాని నుంచి ఈ సినిమా టైటిల్ “ఓరి దేవుడా” ని రివీల్ చేశారు. అలాగే ఈ చిత్రానికి అశ్వత్ దర్శకత్వం వహిస్తుండగా మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ ఇద్దరి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ కనిపించేలా అనిపిస్తుంది. మరి ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు మరియు పివిపి సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం అందిస్తున్నారు. అలాగే తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తున్నాడు.

మోషన్ పోస్టర్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More