టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆ భారీ విగ్రహాన్ని దర్శించుకున్న ఆయన, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మేరకు అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాషాయం దుస్తులు ధరించి ఉన్న విశ్వక్ సేన్, భక్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సినిమాల విషయానికి వస్తే, విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తో బిజీగా ఉన్నారు. కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేహ శెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.