సెన్సార్ పూర్తి చేసుకున్న స్టార్ హీరో చిత్రం !

19th, August 2017 - 01:37:29 PM


తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వివేకం చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగష్టు 24 న విడుదల కానుంది. తెలుగులో ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు ఏ’ సర్టిఫికేట్ ని జారీ చేసారు. ఈ చిత్రం 2 గంటల 29 నిమిషాల నిడివితో ఈ చిత్రం ఉంది.

భారీ బడ్జెట్ లో ఈ చిత్రం యాక్షన్ త్థ్రిల్లర్ గా రూపొందింది. కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ లు ఈ చిత్రం లో హీరోయిన్లుగా నటించారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని తెలుగులో విడులా చేయనున్నారు. అజిత్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హై లైట్ కానున్నట్లు తెలుస్తోంది. శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, అనిరుధ్ సంగీతం అందించాడు.