‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇచ్చే అప్డేట్.. ఎప్పుడంటే..?

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో వస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వృషకర్మ’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటనకు సిద్ధమైంది. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌లు ఉన్న ఒక సరదా వీడియో ద్వారా రేపు(సెప్టెంబర్ 10) సాయంత్రం విడుదల తేదీని వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

డిసెంబర్ 3న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆ తేదీకి ప్రభాస్ ‘ఫౌజీ’ రావాల్సి ఉన్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల అది వాయిదా పడే అవకాశం ఉండటంతో ‘వృషకర్మ’ ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. మరి ఈ చిత్ర యూనిట్ నుంచి రాబోయే అధికారిక ప్రకటనతో రిలీజ్ డేట్‌పై పూర్తి స్పష్టత రానుంది.

Exit mobile version