VS11: విశ్వక్సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

VS11: విశ్వక్సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Published on May 28, 2023 4:41 PM IST


మాస్ కా దాస్ విశ్వక్సేన్ లాస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ మంచి కమర్షియల్ గా విజయం సాధించింది. ఆ తర్వాత రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. తాత్కాలికంగా VS11 అనే టైటిల్‌తో, మేకర్స్ ఈ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో విశ్వక్సేన్ రఫ్ అండ్ మాస్ అవతార్‌లో సిగార్ తాగుతున్నట్లు చూపబడింది. పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. విశ్వక్సేన్ మరోసారి మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ రోజు లెజెండరీ ఎన్టీఆర్ జయంతి కావడంతో, దివంగత నటుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఫార్చూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. అంజలి కథానాయికగా నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు