గ్రాండ్ ఓపెనింగ్ లో వ‌రుణ్ తేజ్‌ కొత్త చిత్రం !

Published on Sep 19, 2022 10:19 am IST

హీరో వ‌రుణ్ తేజ్‌ 13వ చిత్రం నవంబర్ 2022లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు జరిగింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసన్స్ పిక్చర్స్‌ ఈ తెలుగు- హిందీ ద్విభాషా, చిత్రాన్ని నిర్మిస్తుంది. భారత వైమానిక దళం స్ఫూర్తితో ఈ సినిమా రాబోతుంది.

ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ”ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటించే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. గ్లోబల్ దిగ్గజం సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా మరియు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్‌లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నా పాత్ర కోసం నేన శిక్షణ తీసుకుంటాను. ప్రేక్షకులు ఈ సినిమా పై ఎలా స్పందిస్తారో చూడడానికి నేను ఆతృతగా ఉన్నాను’ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

నిర్మాత సందీప్ ముద్దా కూడా ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఈ సినిమా ప్రయాణంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఈ సినిమా కేవలం యాక్షన్ మరియు ఎమోషన్స్ తో నిండిన అద్భుతమైన డ్రామా మాత్రమే కాదు, ఇది మునుపెన్నడూ లేని విధంగా భావోద్వేగాలను కూడా రేకెత్తిస్తుంది అని నాకు ఖచ్చితంగా తెలుసు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ వారి మార్కెటింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్‌లో వారి అసమానమైన అనుభవం మాకు ఎంతో ప్లస్ కానుంది.

సంబంధిత సమాచారం :