“లవ్ యు టూ” ట్రైలర్ ను విడుదల చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్

“లవ్ యు టూ” ట్రైలర్ ను విడుదల చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్

Published on Oct 13, 2021 7:53 PM IST


హ్యాష్ ట్యాగ్ పిక్చర్ బ్యానర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ప్రాచి, జ్యోతి నటీనటులుగా యోగి కుమార్ దర్శకత్వంలో శ్రీకాంత్ కీర్తి నిర్మిస్తున్న లవ్ యు టూ చిత్రం ట్రైలర్ ను అఫీషియల్ గా వి.వి. వినాయక్ గారు తన బర్త్ డే సందర్భంగా వైజాగ్ లో విడుదల చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ కు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నువ్వు తోపురా డైరెక్టర్ హరినాథ్ తో పాటు తదితర సినిపెద్దలు ముఖ్య అతిథిదులుగా పాల్గొని చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇచ్చారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో గెస్ట్ గా వచ్చిన దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీసి మనకు మనమే ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలబడి గలుగుతాము. తీసిన ప్రతి సినిమా హిట్టయితే చేసిన ప్రతి ఒక్కరూ స్టార్స్ అయ్యే వారు. సినిమా తీయడం అంటే పెద్ద స్ట్రగుల్ తో కూడుకున్న పని అలా సక్సెస్ అందుకున్న కొందరే స్టార్ట్ అవుతారు. రామాచారి గారి అబ్బాయి సాకేత్ అందించిన మ్యూజిక్ చాలా ఎక్స్ట్రార్దినరీ గా ఉంది. శ్యాం విజువల్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. ఆట ద్వారా కొరియోగ్రాఫర్ గా సందీప్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా అడుగు పెడుతున్నాడు. మంచి నటుడ్ని సెలెక్ట్ చేసుకుని మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొన్నాడు దర్శకుడు యోగి. ఇప్పుడు జనాలకు ఏ సినిమా కావాలని కోరుకుంటున్నారో అటువంటి మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ట్రైలర్ లోనే తెలుస్తుంది ఇది మంచి సినిమా అని, ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ నీకు నువ్వే తోపు అనిపించుకోవాలి” అని అన్నారు.

ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, “వివి వినాయక్ గారు ఎంతో బిజీ గా ఉన్నా మా ట్రైలర్ ని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత శ్రీకాంత్ గారు యూ.యస్ లో ఉండి మా క్రూ ని చూడకుండా మా పై నమ్మకంతో ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చారు. ఆట సందీప్ గారు నా స్కూల్ మేట్ తను ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు ఇందులో చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. ప్రాచి, జ్యోతి లు చాలా చక్కగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సినిమాకు ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని చాలా హార్డ్ వర్క్ చేశారు. డి.ఓ.పి. శ్యామ్, ఆర్ట్ డైరెక్టర్ వేణు ఇలా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. ప్యాండమిక్ పరిస్థితుల్లో మేము చాలా స్త్రగుల్స్ ఫేస్ చేశాము. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. మా టీం అందరూ కూడా మంచి మూవీ తీసి ఈ సినిమాను సక్సెస్ చేయాలనేది మా తాపత్రయం” అని అన్నారు.

చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ, “నేను ఈ చిత్రం ద్వారా ఇద్దరికి థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఈ చిత్రానికి దర్శకుడిగా ఉండాలని నా గత షార్ట్ ఫిలిమ్స్ లను సందీప్ నిర్మాతకు పంపడంతో ఇంత పెద్ద ప్రాజెక్టు కు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు నిర్మాత శ్రీకాంత్. ఇలాంటి అవకాశం చాలా మందికి రాదు. ఎంతోమంది దర్శకులు డైరెక్షన్ చేసే ఆపర్చునిటీస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ సందీప్ ద్వారా నాకొచ్చిన ఈ అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే వీరిద్దరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లవ్ అనేది ఎప్పుడైనా మనిషి ఏ స్టేజ్ లో ఉన్నా ఏ ఏజ్ లో ఉన్నా మ్యారిటల్ స్టేటస్ ఏమైనా ఒకవేళ ఆ ఇద్దరి మధ్యన అది ప్రేమే అని అనుకుంటే అది ప్రేమే. నో మేటర్ అది పెళ్లి అయినా వేరే మనిషితో లవ్ అని ఉన్నా, అనుకున్నా ఆ ఫీలింగ్ కలిగినా ఒకటేలా ఉంటుంది. ఇట్ ఈజ్ నో డీఫ్రెన్సు అనే జస్టిఫికేషన్స్ తో వచ్చే సినిమా. రిఫర్ కేషన్స్ ఏమైనా గానీ డిస్కస్ ఏ లాట్. లీగల్ పాస్ఫెక్టివ్ లో గానీ ఫిలాసఫీ పాస్ఫెక్టివ్ లో గానీ, ఐడియాలజీ పాస్ఫెక్టివ్ లో గానీ చాలా ఇండెప్త్ డైలాగ్స్ తో చాలా ఎమోషనల్ డ్రామా గా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా పై ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా క్లారిఫై చేశాము. ట్రైలర్ చూస్తే అందులో కొశ్చన్స్ ఉంటాయి, సినిమా లో కొశ్చన్స్ కి ఆన్సర్ ఉంటుంది. పెళ్ళైన వ్యక్తి ప్రేమించ కూడదా అని అడగట్లేదు పెళ్ళైన వాడికి కూడా ఇంకొకరి పైన ఇష్టం ఉంటే ప్రేమించ లేడా అని అడుగుతున్నాము. దట్ కుడ్ బి లవ్ అని జస్టిఫై చేయడమే నా కాన్సెప్ట్ ఇందులో ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమా లాస్ట్ లో వైఫ్ ఇచ్చిన మెసేజ్ చూడండి. ఈ మూవీ ఎమోషనల్ డ్రామా, ఇందులో చాలా జస్టిఫికేషన్స్ ఉంటాయి. జ్యోతి గారి క్యారెక్టర్స్ కు అందరూ ఇన్స్పైర్ అవుతారు. ఇక ఆ తర్వాత నటి ప్రాచి ది చాలా చాలెంజింగ్ క్యారెక్టర్, ఇది టైప్ క్యాస్టింగ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక మ్యారీడ్ పర్సన్ కి రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ గా, ఎమోషనల్ లవర్ గా కన్వీన్సింగ్ గా నటించడం అంత ఈజీ కాదు. ఈ సినిమా ఎలాంటి స్టోరీ అంటే నేను ఇంతకుముందు మూడు నాలుగు సినిమాలు డైరెక్టర్ గా చేసి క్యాపబుల్ గా ప్రూవ్ చేసుకొని ఇలాంటి స్టోరీ ని ముందుకు తెచ్చి ఉంటే యాక్సెప్తబుల్ గా ఉండదేమో కానీ, నా మొదటి చిత్రం తో ఇలాంటి కథతో అవకాశం రావడం చాలెంజింగ్ గా అనిపించింది. దీనికి డ్రామా, ఎమోషన్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. మ్యూజిక్ పరంగా కాంప్రమైజ్ కాలేక కొంత ఇబ్బంది పెట్టి ఉంటాను. ఇదంతా సినిమా ఔట్ ఫుట్ కోసమే. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ ఒక ఎత్తయితే, ఆర్.ఆర్ ఒక ఎత్తు. నేను అనుకున్న దాని కంటే బాగా చేశారు సాకేత్. ఈ సినిమా కోసం కథ ఎంత ఎమోషనల్ గా రాసుకున్నా, డైలాగ్స్ ఎంత ఇంటెన్స్ గా రాసినా గానీ, విజువల్గా ప్రజెంట్ చేయలేకపోతే డైరెక్టర్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. శ్యామ్ ఇచ్చిన విజువల్స్ కానివ్వండి, సాకేత్ ఇచ్చిన మ్యూజిక్ కానివ్వండి, ఈ రెండు లేకపోతే నేను ప్రేమించి రాసుకున్న ఈ కథ ఇంత అందంగా వచ్చేది కాదు. ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు. ఈ ప్రేమ కథ లో కూడా రిలేషన్షిప్ స్టోరీ ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇప్పటి వరకు మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ స్టోరీస్ చూసి ఉంటాము. కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ లవ్ స్టోరీస్, డ్రామా, లవ్ చూసి ఉండం. డ్రామా అండ్ ఎమోషనల్ లవ్ ని క్యారీ చేయగలిగింది ప్రాచీ. షార్ట్ ఫిల్మ్ లో కూడా మంచి ఆదరణ దొరుకుతుందని తను చేసిన సైలెంట్ మెడల్ చాలా వైరల్ అయ్యింది. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా బాగా ఇచ్చింది. దాన్ని ఐన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఆ గ్యాంగ్ రేప్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. అది నాలుగు కోట్లు మందికి రీచ్ అయ్యిందంటే అది సందీప్ వల్ల కావచ్చు, నిర్మాతల వల్ల కావచ్చు. అలా నా షార్ట్ ఫిల్మ్ కు ఏంతో ఆదరణ పెరగడం వల్ల చాలామంది నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను నెక్స్ట్ చేయబోయే ఆ గ్యాంగ్ రేప్ 2 కూడా సందీప్ సహకారంతో చేయాలని కోరుకుంటున్నాను. సందీప్ తో ఈ స్టోరీ గురించి కొన్ని సంవత్సరాలుగా డిస్కషన్ చేస్తున్నాను. తనతోనే చేయాలని పట్టుబట్టాను. ఈ సినిమా మొదలు పెట్టక ముందు నుంచి కూడా ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్స్, డైలాగ్స్, అన్నీ కూడా సందీప్ కి తెలుసు కాబట్టి ఇందులో సందీప్ చాలా మెచ్యూర్డ్ గా డెలివరీ చేశారు. రొమాంటిక్ సీన్స్ లో కూడా కావలసిన దానికంటే ఎక్కువగా చేశారు. నేను కొత్త డైరెక్టర్ అయినా కూడా నాకు వ్యాల్యూ ఇచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అని నమ్మి సినిమా చేయడం జరిగింది. సందీప్ తో నా జర్నీ షార్ట్ ఫిలిం తో స్టార్ట్ అయి ఈరోజు సినిమా వరకు వచ్చింది. ఇలాంటి నటుడితో ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాను” అని అన్నారు.

నటి జ్యోతి మాట్లాడుతూ, “దర్శకుడికి ప్రొడ్యూసర్స్ ఇది ఒక థాంక్స్ చెప్తే సరిపోదు. వాళ్ళు కావాలనుకుంటే సీనియర్ హీరోయిన్స్ ని పెట్టుకోవచ్చు. గానీ, జ్యోతియే ఈ క్యారెక్టర్ కు బాగుంటుందని నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకున్నారు వారికి నా ధన్యవాదాలు. ఎగ్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. డి.ఓ.పి గారు నన్ను చాలా అందంగా చూయించారు. ప్రాచి చాలా బాగా చేశాడు. దర్శకుడు గురించి చెప్పాలి అంటే ఈ స్టేజీ, ఈ మైక్ సరిపోదు. మా లాగా ఉన్న చక్కటి సంసారాల్లో చిచ్చుపెట్టి నాశనం చేసి వీటిని చూసి ఈ సినిమా తీస్తే వీటిని చూసి ఈ జనరేషన్ లో కొత్తగా పెళ్లి చేసుకున్న వారందరికి ఐన్స్పిరేషన్ గా నిలుస్తూ ఇలాంటి మంచి సినిమా మన ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా రియలిస్టిక్ గా ఉండాలని దర్శకుడు రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయిన మమ్మల్ని ఈ వినిమాలో పెట్టుకున్నారు. ఈ మూవీ లో ప్రాచీతో సందీప్ చెప్పే డైలాగ్స్ నాకు డిఫికల్ట్ గా అనిపించేది. తన వైఫ్ గా నా హాట్ వీక్ గా అనిపించేది. కానీ యాక్టింగ్ అయినా మూవీ అయినా మమ్మల్ని చూసి ఇన్స్పయిర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మమ్మల్ని చూసి చాలా మంది బెస్ట్ కపుల్ అనేవారు. అలా ఉన్న మేము ఇలాంటి సినిమాతో మేము మెసేజ్ ఇస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తే చాలామంది మా పోస్టర్ ను చూసి ఇలాంటి సినిమా మీరు చేయకూడదని చెప్పారు. అయినా ప్రేక్షకులకు మేము ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలని చేస్తున్నాము. ఇంత మంచి సినిమాతో మెసేజ్ ఇస్తున్న మా సినిమాను దర్శకుడు లవ్ యు టూ, పార్ట్ 2 ,పార్ట్ 3 లు తీస్తూ చాలా చాలా ముందుకు వెళుతూ మా లాంటి మంచి మంచి కపుల్స్ ని విడగొడుతూ మగజాతి నంతా నాశనం చేస్తూ మంచి మంచి ఫ్యామిలీస్ అందరిలో డిస్ట్రబ్ చేస్తూ చేస్తూ మీ కాంట్రవర్షియల్ స్టోరీ ముందుకెళ్లాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా బ్లెస్స్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే అరిస్టు గా వెరీ గుడ్ ఫీలింగ్. ఇప్పుడు ఉన్న కామన్ సిచ్వేషన్ లో చాలామంది కి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఇరుగు పొరుగు వారే కాకుండా చాలా మంది వాళ్ళ లైఫ్ లో జరిగే కామెంట్ 70% మంది కామన్ ఫేస్ చేస్తున్న హౌస్ వైఫ్స్ కు నా నా వైఫ్ క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ గా ఇంత మంచి రోల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. పెర్ఫార్మన్స్ అంటే నన్ను ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ సూర్యకాంతం లాగా గయ్యాళి పెళ్ళాం లాగా చూపించారు. ఈ సినిమా చూసినప్పుడు మీరు ఖచ్చితంగా అనుకుంటారు ఎలా ఎలా అని. సినిమా పరంగా ఇది ఓకే గాని పర్సనల్గా ఇది చాలా కష్టం. ఎవరు కూడా సినిమాను ఇన్స్పిరేషనల్ గా తీసుకోవద్దు, కేవలం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మై లవ్, మై ఫరెవర్, మై లైఫ్ సందీప్, ప్రతి మగాడి వెనుక ఒక అమ్మాయి ఉంటుంది అంటారు. కానీ ఒక పెళ్లి అయిన అమ్మాయి వెనుక కూడా ఒక భర్త ఉంటాడు అని మా సందీప్ నిరూపిస్తూ. నాకు ఎంతో సపోర్టుగా ఉంటూ నీకున్న టాలెంట్ కి, మంచి పెర్ఫార్మెన్స్ కు మంచి క్యారెక్టర్స్ చేయాలని నాకు సపోర్ట్ గా నిలిచి వెన్నుదన్నుగా ఉన్నాడు సందీప్ అందుకే తనంటే నాకు ఎంతో ప్రాణం” అని అన్నారు.

హీరో ఆట సందీప్ మాట్లాడుతూ, “వివి వినాయక్ గారికి నా ధన్యవాదాలు. తను ఎంతో బిజీగా వున్న మాకోసం టైం ఇచ్చి మా ట్రైలర్ ను విడుదల చేశారు. శ్రీకాంత్ గారికి సినిమా అంటే ప్యాషన్ తను చాలా సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా నిలబడాలని కోరుకుంటున్నాను. తను ఎంత ప్యాసినెట్ ప్రొడ్యూసర్ అంటే మాఇద్దరినీ పెట్టి ఇలాంటి ఎంత మెసేజ్ ఉన్న సినిమా తీసుకున్నందుకు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పని చేశారు.ప్యాండమిక్ స్విచ్వేషన్ లో కూడా అందరం కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాము. ప్రాచీ చాలా సపోర్ట్ చేసింది రొమాంటిక్ సీన్స్ లో కూడా చాలాకంఫర్టబుల్ గా నటించింది. నా భార్య జ్యోతి నేను చేసే సీన్స్ లలో ఇలా కాదు అలా చేయమని నాకు సపోర్ట్ గా నిలిచి చెప్పడం జరిగింది.తనని నేను కో యాక్టర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. తను మై లవ్ అని చెప్పగలను నా లైఫ్ లో వైఫ్ అని చెప్పగలను. అందరూ ఇది నీ సబ్జెక్టు కదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇది నా సబ్జెక్ట్ కాదు దర్శకుడు ఇప్పుడు జరుగుతున్న కథలను బేస్ చేసుకొని తీసిన కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అలాగే కరోనా టైంలో నేను మా ఫాదర్ ని కోల్పోవడం జరిగింది.దీన్ని నేను లైఫ్ లో జీర్ణించుకోలేక పోతున్నాను.మా ఫాదర్ షూటింగు చూస్తుండగానే చనిపోవడం జరిగింది. తను చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇది నాకు తీరని లోటు. కరోనా కాలంలో ఎంతో మంది ఎంతోమందిని కోల్పోయారు వారిలో నేను ఒకరిని. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫాదర్ కోల్పోవడం పోయినందుకు నాకు చాలా బాధ గా ఉంది. నా వైఫ్ కూడా నాకు సపోర్ట్ గా నిలిచి నాకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని కన్నీటి పర్యంతం అయ్యారు” అని అన్నారు.

నటి ప్రాచీ మాట్లాడుతూ, “దర్శకుడు కి తన విజన్ ఏంటో ఇందులో చాలా చక్కగా చూపించాడు. ఇలాంటి మంచి మూవీ లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాత లకు ధన్యవాదాలు” అని

డి.ఓ.పి. శ్యామ్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు మేము నిర్మాత శ్రీకాంత్ ను చూడలేదు తను మమ్మల్ని అంతగా నమ్మారు. ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని అన్నారు.

సంగీత దర్శకుడు సాకేత్ మాట్లాడుతూ, “చాలా బోల్డ్ మూవీ ని సెలెక్ట్ చేసుకొని దర్శకుడు ఈ సినిమా చేయడం జరిగింది. ఒక మంచి కాన్సెప్ట్ ని సింపుల్ గా నీట్ గా తీసుకొచ్చాడు. లైవ్ లో మమ్మల్ని చూడకపోయినా వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని మానిటర్ చేస్తూ మామీద నమ్మకంతో అంతగా నన్ను ఖర్చు పెట్టి తీశారు శ్రీకాంత్ గారు ఇక్కడ నుండి మాకు చాలా సపోర్ట్ చేశారు సందీప్, జ్యోతి ,ప్రాచీ ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేశారు సినిమాలో ఉన్న మూడు మెయిన్ క్యారెక్టర్స్ తో అద్భుతంగా చూయిస్తూ చాలా బోల్డ్ కంటెంట్ తీసుకొని చేయడం జరిగింది” అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ వేణు మాట్లాడుతూ, “నాకు ఇలాంటి మంచి చిత్రానికి సెట్ వేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు.

కేశవ్ దీపక్ మాట్లాడుతూ, “లవ్ యు టూ కాన్సెప్ట్ మూవీ సెన్సిటివ్ సబ్జెక్ట్. దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని మూవీ ని తెరకెక్కించాడు. సందీప్ కాంబినేషన్ లో నా సీన్స్ ఉంటాయి.సందీప్ గారు చాలా అద్భుతంగా పర్ఫామెన్స్ చేశారు.ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది” అని అన్నారు.

అభిలాస్ మాట్లాడుతూ, “2019 నుండి సందీప్ తో పరిచయం ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే సందీప్ గారు నన్ను రిఫర్ చేశాడు.ఇదే నా మొదటి చిత్రం. ఇంత పెద్ద యూనిట్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు