స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ !

Published on May 15, 2019 2:00 pm IST

నాగప్రభాకరన్ దర్శకత్వంలో హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ‘‘శివరంజని’’ చిత్ర ట్రైలర్ ను సెన్షేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ గారు మాట్లాడుతూ.. ‘‘ ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని.. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అన్నారు.

నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలకు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి.
అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్, నిర్మాత : కటకం వాసు, దర్శకత్వం : నాగ ప్రభాకరన్.

సంబంధిత సమాచారం :

X
More