వివిఆర్ సెన్సార్ కు ఎప్పుడు వెళ్లనుందంటే !

VVR6

గత ఏడాది ‘రంగస్థలం’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది ప్రారంభంలో ‘వినయ విధేయ రామ’ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం ఈనెల 7న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నందున ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ కథానాయికగా నటించగా వివేక్ ఒబేరాయి ప్రతినాయకుడి పాత్రను పోషించారు. దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version