భారీ వసూళ్లను రాబడుతోన్న “వాల్తేరు వీరయ్య”

Published on Jan 16, 2023 3:00 pm IST

ఈ సంక్రాంతి సీజన్‌లో విడుదలైన భారీ చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్ లుగా నటించిన వాల్తేర్ వీరయ్య ఒకటి. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 రోజుల్లో 108 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ విషయాన్ని మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. రానున్న రోజుల్లో ఈ మెగా చిత్రం మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ బిగ్గీలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :