వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “వాల్తేరు వీరయ్య”

Published on Oct 1, 2023 3:03 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. ఈ చిత్రం ఈ దసరా పండుగ సందర్భంగా జెమిని టీవీ ఛానల్ లో ప్రసారం కానుంది.

అయితే ఇంకా డేట్ అండ్ టైమ్ ను ప్రకటించలేదు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవితేజ, కేథరిన్ థెరిస్సా, ప్రకాష్ రాజ్, బాబీ సింహ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :