వాల్తేరు వీరయ్య ‘బాస్ పార్టీ’ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్, టైం ఫిక్స్

వాల్తేరు వీరయ్య ‘బాస్ పార్టీ’ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Nov 22, 2022 12:22 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ మాస్ పెర్ఫార్మన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా పక్కా మాస్ స్టైల్ తో సాగె యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బాబీ ఈ మూవీని తెరకెక్కించినట్లు చెప్తోంది యూనిట్.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక ఈ మూవీ నుండి బాస్ పార్టీ పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని నవంబర్ 23న సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన యూనిట్, తాజగా ఈ సాంగ్ యొక్క ప్రోమోని నేడు ఉదయం 10 గం. 35 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసింది. దీనితో ఈ సాంగ్ ప్రోమోని వినేందుకు మెగా ఫ్యాన్స్ లో అప్పుడే ఆనందం రెట్టింపు అయింది. మరి ఈ సాంగ్ ప్రోమో ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు