సక్సెస్ ఫుల్ గా 25 డేస్ పూర్తి చేసుకున్న “వాల్తేరు వీరయ్య”

Published on Feb 6, 2023 5:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రం కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

ఈ చిత్రం తాజాగా 25 డేస్ ను పూర్తి చేసుకుంది. అదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం లో శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం ఇంకా పలు చోట్ల మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం :