“డీజే వీరయ్య” మాస్ పార్టీ కి అదిరే రెస్పాన్స్.!

“డీజే వీరయ్య” మాస్ పార్టీ కి అదిరే రెస్పాన్స్.!

Published on Nov 24, 2022 7:00 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మల్టీస్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ అయితే నిన్ననే రిలీజ్ కాగా ఈ సాంగ్ అదిరే మాస్ బీట్స్ తో ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. మరి డీజే వీరయ్యగా మారి అదరగొట్టిన ఈ సాంగ్ అయితే కేవలం 14గంటల్లోనే 7 మిలియన్ మేర వ్యూస్ ని అందుకొని దూసుకెళ్తుంది.

మన సీనియర్ హీరోస్ లో అయితే ఇదో ఫాస్టెస్ట్ రికార్డు అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి అయితే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ తో మేకర్స్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా కనిపించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు