డీఎస్పీ మార్క్ తో ఇంట్రెస్టింగ్ గా ‘బాస్ పార్టీ’ ప్రోమో..

డీఎస్పీ మార్క్ తో ఇంట్రెస్టింగ్ గా ‘బాస్ పార్టీ’ ప్రోమో..

Published on Nov 22, 2022 10:51 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని ప్రెజెంట్ చేస్తూ చేస్తున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ మేకర్స్ టైటిల్ టీజర్ రిలీజ్ చెయ్యగా దీనికి మెగా ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

ఇక నెక్స్ట్ సాలిడ్ అప్డేట్ గా మేకర్స్ బాస్ పార్టీ అంటూ ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చెయ్యగా ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. మరి ఈ ప్రోమో అయితే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మార్క్ మాస్ ట్యూన్ లో అలాగే తన మార్క్ డైలాగ్స్ తో స్టార్ట్ అయ్యింది.

అలాగే మెగా స్వాగ్ తో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. అయితే మెగా ఫ్యాన్స్ అయితే ప్రోమో లో కాస్త ఎక్కువ ఆశించి ఉండొచ్చు కానీ ఈ ప్రోమోలో లాస్ట్ బీట్ తో మాత్రం రేపు వచ్చే సాంగ్ సూపర్ గా ఉండేలా అనిపిస్తుంది. మరి ఇది వినాలి అంటే రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు ఆగాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు