లేటెస్ట్ : మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ హిందీ టీజర్ రిలీజ్

లేటెస్ట్ : మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ హిందీ టీజర్ రిలీజ్

Published on Dec 29, 2022 12:04 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీని బాబీ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలక రోల్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్, మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకునేలా దర్శకుడు బాబీ ఈ మూవీని తెరకెక్కించినట్లు చెప్తోంది యూనిట్. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తెలిపారు. అయితే విషయం ఏమిటంటే, వాల్తేరు వీరయ్య హిందీ టీజర్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో అఫీషయల్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ తెలుగు, హిందీ భాషల్లో 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు