భారీ సెట్ లో “వాల్తేర్ వీరయ్య” ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్!

భారీ సెట్ లో “వాల్తేర్ వీరయ్య” ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్!

Published on Nov 1, 2022 7:46 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేర్ వీరయ్య. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఈ చిత్రం లో మెగాస్టార్ మాస్ గెటప్ అద్దిరిపోవడం తో ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా ఇంట్రడక్షన్ ఉంటుంది అని తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ శివార్లలో భారీ సెట్ లో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ మరొక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు