ఈ సీక్వెన్స్ తో బాస్ మళ్ళీ “ఖైదీ” మార్క్ ట్రెండ్ సెట్ చేస్తాడా.?

ఈ సీక్వెన్స్ తో బాస్ మళ్ళీ “ఖైదీ” మార్క్ ట్రెండ్ సెట్ చేస్తాడా.?

Published on Dec 17, 2022 1:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం పై అయితే మంచి అంచనాలు నెలకొనగా ఈ చిత్రంపై మేకర్స్ ఇప్పుడు మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అయితే దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) ఓ సాలిడ్ పోస్టర్ తో ఈ సీన్ థియేటర్స్ లో అదిరిపోతుంది అని తెలిపారు.

అయితే ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే ఓ పోలీస్ స్టేషన్ లా చాలా మందికి అనిపించి ఉంటుంది. మరి దీనితో చిరు ట్రెండ్ సెట్టింగ్ చిత్రాల్లో ఖైదీ సినిమాలో ఉన్న ఐకానిక్ పోలీస్ స్టేషన్ సీన్ ని తలపించింది. దీనితో ఆ మాజికల్ సీన్ ని మళ్ళీ రిపీట్ చేస్తుందా అని అనిపిస్తుంది. దీనితో అయితే ఈ సీన్ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు