“వాల్తేరు వీరయ్య” మెగా – మాస్ పూనకాల పోస్టర్ వచ్చేసింది.!

“వాల్తేరు వీరయ్య” మెగా – మాస్ పూనకాల పోస్టర్ వచ్చేసింది.!

Published on Dec 29, 2022 2:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి సహా మాస్ మహారాజ రవితేజ లు హీరోలుగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే భారీ అంచనాలు పెట్టుకొని వస్తుండగా రీసెంట్ గా వచ్చిన వీరయ్య టైటిల్ సాంగ్ మరియు సినిమా ప్రెస్ మీట్ లు ఆసక్తిగా మారాయి.

ఇక దీని తర్వాత వీరయ్య టైటిల్ సాంగ్ కి మించి మెగా – మాస్ పూనకాల సాంగ్ అంటూ ఇద్దరు స్టార్స్ పై దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ సాలిడ్ బీట్ పై మేకర్స్ ఊరిస్తూ వస్తున్నారు. ఇక దీనిపై అయితే మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు. మరి మెగాస్టార్ మరియు రవితేజ లపై డిజైన్ చేసిన ఈ క్రేజ్య్ పోస్టర్ అయితే అభిమానులు అదిరే కిక్ ఇచ్చేలా కనిపిస్తుంది అని చెప్పాలి.

ఇదొక సాలిడ్ నెంబర్ లా కనిపిస్తుండగా ఎదురెదురుగా మెగాస్టార్ మరియు రవితేజ లు సీరియస్ గా చూసుకుంటున్న ఎక్స్ ప్రెషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ క్రేజీ నెంబర్ ని అయితే మేకర్స్ రేపు డిసెంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై టైం రావాల్సి ఉంది. అలాగే మరోపక్క అయితే ఈ సాంగ్ థియేటర్స్ లో కూడా లాంచ్ చేసే ప్లాన్ లు ఉన్నాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు