మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ రన్ టైం లాక్ ?

మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ రన్ టైం లాక్ ?

Published on Dec 16, 2022 3:03 AM IST


మెగాస్టార్ చిరంజీవితో బాబీ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ కమర్షియల్ మాస్ మూవీ వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి ఇందులో వీరయ్య అనే ఊర మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా అందాల నటి శృతి హాసన్ నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఆర్థర్ ఏ విల్సన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ తో ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న వాల్తేరు వీరయ్య నుండి అతి త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క రన్ టైం మొత్తం 2 గం. 35 ని. ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు బాబీ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది యూనిట్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వాల్తేరు వీరయ్య మూవీ 2023 జనవరి 13న విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు