‘వాల్తేరు వీరయ్య’ నార్త్ అమెరికా రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

‘వాల్తేరు వీరయ్య’ నార్త్ అమెరికా రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Dec 2, 2022 2:00 AM IST


మెగాస్టార్ చిరంజీవితో యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మాస్ మహారాజ రవితేజ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ అందరినీ అలరించి మరింత హైప్ ఏర్పరిచింది. 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న తమ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని అంటోంది వాల్తేరు వీరయ్య యూనిట్. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఇళయదళపతి విజయ్ నటిస్తున్న వరిసు, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీస్ యొక్క నార్త్ అమెరికా రైట్స్ ని దక్కించుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు, లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య మూవీ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు. మరి అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన వాల్తేరు వీరయ్య రిలీజ్ తరువాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు