లేటెస్ట్ : ‘వాల్తేరు వీరయ్య’ ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ థియేటర్స్ ఫిక్స్

లేటెస్ట్ : ‘వాల్తేరు వీరయ్య’ ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ థియేటర్స్ ఫిక్స్

Published on Dec 29, 2022 6:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా వాల్తేరు వీరయ్య నుండి ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ, శ్రీదేవి చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఇలా మూడు సాంగ్స్ కూడా మెగా ఫ్యాన్స్ ని అలానే ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై విపరీతమైన అంచనాలు ఏర్పరిచాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ నుండి పూనకాలు లోడింగ్ అనే మాస్ సాంగ్ డిసెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

మెగాస్టార్ చిరంజీవి తో కలిసి మాస్ మహారాజా రవితేజ కూడా అదిరిపోయేలా చిందేయనున్న ఈ సాంగ్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో గల థియేటర్స్ లో ప్రదర్శించనున్నట్లు కొద్దిసేపటి క్రితం థియేటర్స్ యొక్క లిస్ట్ ని ప్రకటించారు మేకర్స్. హైదరాబాద్ సంధ్య 70 ఎం ఎం, నెల్లూరు ఎం 1 సినిమాస్, అనంతపూర్ ఎస్వీ సినీ మ్యాక్స్, రాజమండ్రి స్వామి, గుంటూరు భాస్కర్, విజయవాడ జయరాం థియేటర్స్ లో సాయంత్రం 5 గం. లకు ఈ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు