‘వాల్తేరు వీరయ్య’ అసలు పూనకాలు లోడింగ్ సర్ప్రైజ్ లోపల దాచి ఉంచారా ?

‘వాల్తేరు వీరయ్య’ అసలు పూనకాలు లోడింగ్ సర్ప్రైజ్ లోపల దాచి ఉంచారా ?

Published on Dec 20, 2022 1:02 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక దాని తరువాత ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తునగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ పై అందరిలో భారీ అంచానలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక వాల్తేరు వీరయ్య నుండి ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ రెండూ కూడా మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో పూనకాలు లోడింగ్ అనే సూపర్ సాంగ్ ఉందని, ఆ సర్ప్రైజ్ ని త్వరలో రివీల్ చేసేందుకు యూనిట్ దాచి ఉంచారని తెలుస్తోంది. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ కూడా డ్యాన్స్ అదరగొట్టారని, ఫ్యాన్స్ కి ఈ సాంగ్ ఫుల్ ఐ ఫీస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సాంగ్ రిలీజ్ యొక్క అప్ డేట్ త్వరలోనే రానుందట. మొత్తంగా ఈ విధంగా రోజు రోజుకు ఈ మూవీ పై హైప్ విపరీతంగా పెరుగుతోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023, జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు