మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!

మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” సెకండ్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!

Published on Dec 18, 2022 5:14 PM IST


చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు రెండో సింగిల్‌ శ్రీదేవి చిరంజీవి అభిమానులను అలరించనుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ పాటను రేపు సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

పాట విడుదల సమయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కొత్త పోస్టర్‌లో చిరు సూపర్ హ్యాండ్సమ్‌గా, శృతి హాసన్ చాలా అందంగా కనిపిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తో వింటేజ్ చిరును తిరిగి తీసుకువస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13, 2023న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు