‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 17, 2022 4:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ తొలిసారిగా కలిసి నటిస్తున్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. దానికి ప్రధాన కారణం చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ ఇందులో పక్కా మాస్ పాత్ర చేస్తుండడంతో పాటు ఆయనకు వీరాభిమాని అయిన బాబీ దీనికి దర్శకత్వం వహించడం. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తనకు ఇష్టమైన మెగాస్టార్ ని తనతో పాటు కోట్లాది ఫ్యాన్స్, ఆడియన్స్ ఏవిధంగా చూడాలని భావిస్తున్నారో పక్కాగా వాల్తేరు వీరయ్య స్క్రిప్ట్ ని బాబీ అదే విధంగా రాసుకున్నట్లు చెప్తోంది యూనిట్. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఇక వాల్తేరు వీరయ్య నుండి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవిని అవుతా’ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని డిసెంబర్ 19న విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఫ్రాన్స్ లో అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా అదిరిపోతుందని అంటోంది యూనిట్. కాగా ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు