“వాల్తేరు వీరయ్య”..పూనకాలకి అదిరే ప్లానింగ్.!

“వాల్తేరు వీరయ్య”..పూనకాలకి అదిరే ప్లానింగ్.!

Published on Dec 28, 2022 1:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ మరో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” చిత్రం కోసం తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఇప్పుడు నెలకొనగా ఈ మాస్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అన్ని పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం నుంచి అయితే లేటెస్ట్ గా వచ్చిన టైటిల్ సాంగ్ మాస్ ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకోగా.

నెక్స్ట్ అయితే ఈ సినిమా నుంచి వస్తున్న మరో మాస్ సాంగ్ పూనకాలు లోడింగ్ న్నీ మేకర్స్ హిట్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ కి అయితే మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం గాను మేకర్స్ అయ్యితే భారీ ఎత్తున ఈవెంట్ సహా థియేటర్స్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే దీనిపై అధికారిక అప్డేట్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉందట. మరి ఈ తర్వాత నుంచి అంచనాలు ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు