స్టాండర్డ్ గా “వాల్తేరు వీరయ్య” మాస్ డామినేషన్.!

Published on Jan 31, 2023 10:30 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చి భారీ లాభాలు ఈ చిత్రం అందుకొని తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు మూడో వారం లోకి వచ్చినప్పటికీ కూడా తెలుగు స్టేట్స్ లో అయితే మంచి వసూళ్లు రాబడుతూ ఉండడం విశేషం.

టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా భారీ హిట్ లు సరసన సినిమా వచ్చిన 16, 17 రోజుకీ కూడా భారీ వసూళ్లు రాబడుతుంది. దీనితో వాల్తేరు వీరయ్య డామినేషన్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ఇంకా ఈ సినిమా రన్ అయితే కొనసాగుతూ ఉండగా ఫైనల్ రన్ లో మాత్రం ఇంకా మరిన్ని లాభాలు అందిస్తుందని ట్రేడ్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే శృతి హాసన్ మరియు క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం :