‘వాల్తేరు వీరయ్య’ మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘వాల్తేరు వీరయ్య’ మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 24, 2022 7:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి పూర్తి మాస్ యాక్షన్ రోల్ లో నటిస్తున్న తాజా సినిమా వాల్తేరు వీరయ్య. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని బాబీ తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన బాస్ పార్టీ, శ్రీదేవి చిరంజీవి సాంగ్స్ రెండూ కూడా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి అనే చెప్పాలి.

ఇక ఈ మూవీ నుండి మూడవది అయిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మాస్ మహారాజా రవితేజ కీలక రోల్ చేస్తున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, క్యాథరీన్ త్రెసా, వెన్నెల కిషోర్ వంటి వారు ఇతర ముఖ్య రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు