ఆరోజున ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఫిక్స్ అంటున్న స్టార్ రైటర్

ఆరోజున ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఫిక్స్ అంటున్న స్టార్ రైటర్

Published on Dec 17, 2022 9:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వాల్తేరు వీరయ్య షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో చాలా గ్యాప్ తరువాత చిరంజీవి ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేస్తుండగా కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ నుండి ఇటీవల ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక అతి త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా 2023 జనవరి 13 న భారీ స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో మరింత హైప్ పెంచేలా దీనికి స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేస్తున్న కోనా వెంకట్ కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. రాబోయే జనవరి 13న వాల్తేరు వీరయ్య దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అందరిలో ఎంతో హైప్ ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు