‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ రిలీజ్ టైం ఎప్పుడంటే ?

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ రిలీజ్ టైం ఎప్పుడంటే ?

Published on Dec 26, 2022 6:30 PM IST


మెగాస్టార్ చిరంజీవితో యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఉన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నుండి ఇటీవల రెండు సాంగ్స్ రిలీజ్ అయి ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇక వాల్తేరు వీరయ్య నుండి టైటిల్ సాంగ్ ని డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన యూనిట్, ఆ సాంగ్ ని నేడు సాయంత్రం 6 గం. 3 ని. అలానే 8 గం. 1 ని. ల మధ్యన ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చని కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. మరోవైపు వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టిన మేకర్స్ అతి త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు