ఎన్టీఆర్ తో ఆ జానర్ లో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నాం – ప్రొడ్యూసర్ నాగవంశీ

Published on Feb 15, 2023 2:59 am IST


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తదుపరి తన NTR 30 మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కనుంది. ఇక దీని తరువాత ప్రశాంత్ నీల్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB 28 మూవీ నిర్మిస్తోన్న హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాత నాగవంశీ, నేడు ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, తాను ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అనేది అందరికీ తెలిసిందే అని అన్నారు.

ఇక ఇటీవల కొన్ని కారణాల వలన మా బ్యానర్ లోని ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఆగిపోయిందని అయితే త్వరలో తమ బ్యానర్ లోనే ఎన్టీఆర్ తో భారీ పౌరాణిక సినిమా చేయాలనే ఆలోచన తమకు ఉందని అన్నారు. త్రివిక్రమ్ గారికి అటువంటి జానర్ కొత్త కాబట్టి దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా దాని గురించి రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని నాగవంశీ అన్నారు.

సంబంధిత సమాచారం :