జస్ట్ లుక్స్ కోసమే మహేష్ సినిమా చూడొచ్చా..లేటెస్ట్ పిక్స్ వైరల్

Published on Oct 16, 2021 1:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మన టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాన్ సినిమా దగ్గర ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏజ్ పెరుగుతున్నా కూడా దాన్ని రివర్స్ గేర్ లో పెట్టి ఎవర్ యంగ్ లుక్ లో కనిపిస్తూ మహేష్ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. అయితే ఇపుడు తాను లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” సినిమాతో మాత్రం వేరే లెవెల్ ట్రీట్ ని మహేష్ ఇవ్వనున్నాడని గ్యారంటీ అని చెప్పొచ్చు.

సినిమా కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ మహేష్ లుక్స్ నే మళ్ళీ చాలా కాలం తర్వాత మెస్మరైజ్ చేసేలా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు పరశురామ్ పెట్ల పెట్టిన దృష్టి ఈ సినిమాలో మహేష్ లుక్స్ పరంగా డ్రెస్సింగ్ పరంగా థియేట్రికల్ గా మహేష్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది.

తాజాగా మరికొన్ని ఫోటోలు మహేష్ సర్కారు వారి కాస్ట్యూమ్ లో ఉన్నవి వైరల్ అవుతున్నాయి. ఇవి చూసినా కూడా అంతే సూపర్బ్ గా కనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ లలో మహేష్ మరింత స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. దీనితో ఇవి ఒక లెక్కలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :