“RRR” తో వింటేజ్ వెర్షన్ రాజమౌళిని కూడా చూడబోతున్నామనమాట!

“RRR” తో వింటేజ్ వెర్షన్ రాజమౌళిని కూడా చూడబోతున్నామనమాట!

Published on Nov 7, 2021 8:07 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుల్లోనే ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఒకరు. తన సినిమాలతో భారతీయ సినిమాను తెలుగు సినిమా ఖ్యాతిని ఇంకో స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి చేసిన లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ సినిమాతో ఇప్పుడు రాజమౌళి అండ్ టీం ఒక రేంజ్ హైప్ ఎక్కిస్తున్నారు.

అయితే ఇక్కడ వింటేజ్ వెర్షన్ రాజమౌళి అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే.. ఒక దర్శకుడిగా సినిమా చూసే ఆడియెన్ కి ఏమేమి కావాలో రాజమౌళికి బాగా తెలుసు. ఆడియెన్స్ పల్స్ తెలిసిన రాజమౌళి తన మొదటి సినిమా నుంచి కూడా అన్ని హంగులు రాబట్టారు. ఎమోషన్స్, డాన్సులు, మ్యూజిక్, ఫైట్స్ ఇలా అన్ని కీలక అంశాలు కూడా అదిరే లెవెల్లో రాజమౌళి సినిమాల్లో మనం చూసాం.

కానీ ఈగ నుంచి బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి సినిమాల్లో డాన్స్ అనే అంశం బాగా మిస్సయ్యింది. స్కోప్ లేక కుదరలేదు కానీ ఈగ లో అయితే లాస్ట్ సాంగ్ లో మన హీరోస్ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ని చేపించేసి ఆకట్టుకున్నారు. ఇదంతా అయ్యి ఒక ఏడేళ్లు అయ్యిపోయిందేమో ఇక. యమదొంగ, మగధీర సినిమాల్లో ఎన్టీఆర్, చరణ్ లతో చేయించిన సాంగ్స్ ట్రెండ్ సెట్టింగ్ డాన్స్ స్టెప్స్ ఇప్పటికీ వారి అభిమానులకు గుర్తే.. అక్కడ వరకు ఎందుకు రవితేజ, ప్రభాస్ లతోనే అప్పట్లో సాలిడ్ సాంగ్స్ చేయించారు రాజమౌళి.

అంత కేర్ గా రాజమౌళి సినిమాలు ఉండేవి. ఇప్పుడు అలాంటిది డాన్స్ లో ఆరితేరి ఉన్న ఇద్దరు మాస్ హీరోలని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొస్తే ఊరుకుంటారా? సిల్వర్ స్క్రీన్ పై బ్లాస్ట్ చూపిస్తారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి సాంగ్ నే చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ లో ఎన్టీఆర్ చరణ్ లతో ఈ రెండో సాంగ్ మాస్ లెవెల్లో అదిరే డాన్స్ లతో ఉంటుందట. అందుకే మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వింటేజ్ వెర్షన్ రాజమౌళిని చూడబోతున్నాం అని చెప్పాల్సి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు