ఇటువంటి పండుగలు ప్రతి ఏడాది చేసుకోవాలి తమ్ముళ్లు – ‘ధమాకా’ మాస్ మీట్ లో రవితేజ

ఇటువంటి పండుగలు ప్రతి ఏడాది చేసుకోవాలి తమ్ముళ్లు – ‘ధమాకా’ మాస్ మీట్ లో రవితేజ

Published on Dec 30, 2022 2:30 AM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకుని ప్రస్తుతం అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడంతో నేడు హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో మూవీ యొక్క మాస్ మీట్ ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా హీరో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ, ముందుగా ఈ సినిమా సక్సెస్ కి ముఖ్య కారణం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అని, తను ఇచ్చిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని, ముందు సాంగ్స్ ఎంతో సక్సెస్ అవడంతో మూవీ పై అందరిలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయని అన్నారు. అలానే నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ ఇద్దరూ కూడా మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారని, డైలాగ్ రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ సినిమా కోసం ఎంతో కష్టపడి మిమ్మల్ని అలరించేలా పలు అద్భుతమైన డైలాగ్స్ రాసారని అన్నారు.

చివరిగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఎక్కడ ఉంటె అక్కడ ఫుల్ ధమాకానే అని, ఈ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టిన త్రినాధరావు రాబోయే రోజుల్లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ముఖ్యంగా తన సినిమాలని ఇంతగా ఆదరిస్తున్న తమ్ముళ్ళైన అభిమానులు, ప్రేక్షకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన రవితేజ, రెండేళ్ల తరువాత మనకి ధమాకా తో పండుగ వచ్చింది. కానీ ఇకనుండి ప్రతి ఏడాది మనకు పండుగలు రావాలి, వస్తాయని, ఇలానే నన్ను ఆదరించాలని కోరుకుంటూన్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు