రొమాంటిక్ నుండి “వాట్ డు యూ వాంట్” లిరికల్ వీడియో విడుదల!

Published on Oct 24, 2021 6:48 pm IST

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్ లుగా అనీల్ పాడురీ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం అక్టోబర్ 29 వ తేదీన థియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్లు సైతం భారీగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడం తో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం నుండి తాజాగా మరొక లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. వాట్ డు యూ వాంట్ అంటూ సాగే ఈ పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భాస్కరభట్ల రాసిన ఈ పాటను మంగ్లీ మరియు కృష్ణ లు పాడటం జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు ఛార్మి లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా, రమ్య కృష్ణ మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More