ఇంట్రెస్టింగ్..తగ్గిన టికెట్ ధర “RRR” కి ప్లస్ అయ్యిందా.?

Published on Apr 5, 2022 12:00 pm IST


తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇదే ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ సినిమా “బాహుబలి పార్ట్ 2” రికార్డులని ఏది బ్రేక్ చెయ్యలేదు అనుకునే టైం మళ్ళీ ఆ సినిమా తర్వాత చేసిన RRR తో రాజమౌళి హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

రాజమౌళి తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల స్టార్డం కూడా తోడు కావడంతో కేవలం 9, 10 రోజుల్లోనే ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హవాలో మొదటి పది రోజులు భారీ వసూళ్ళని అందుకుంది. కానీ ఈ భారీగా పెంచిన ధరలు అయితే కాస్త దెబ్బ తీశాయన్న మాట కూడా లేకపోలేదు.

ముఖ్యంగా ఏపీలో అయితే మొదటి మూడు రోజులు తర్వాత చాలా వరకు నేల టికెట్లు తెగలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తగ్గిన ధరలతో వర్కింగ్ డే అయిన రెండో సోమవారం కూడా ఈ సినిమా మార్నింగ్ షో నుంచే దాదాపు 90 శాతంకి పైగా అనేక థియేటర్స్ లో ప్రేక్షకులతో నిండిపోయాయి. దీనితో ఈ తగ్గిన టికెట్ ధరల ప్రభావం మళ్ళీ సినిమాకి బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. దీనితో లాంగ్ రన్ పై కూడా ఇపుడు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.

సంబంధిత సమాచారం :