పరశురాముడి పాత్ర పరిస్థితేంటి ?

పరశురాముడి పాత్ర పరిస్థితేంటి ?

Published on May 17, 2024 2:02 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఈ మూవీ క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని మొదట రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత పరశురాముడి పాత్రలో నాగార్జున కనిపిస్తాడని పుకార్లను పుట్టించారు. ఐతే, తాజాగా పరశురాముడి పాత్రలో కూడా ప్రభాసే కనిపిస్తాడని అంటున్నారు.

ఓ దశలో అయితే, పరశురాముడిగా బాలీవుడ్ హీరో దర్శనం ఇస్తాడని టాక్ నడిచింది. మొత్తమ్మీద అసలు పరశురాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. వార్తలు అయితే రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. కథ ప్రకారం పరశురాముడి పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. మరి అలాంటి కీలకమైన పాత్ర పై ఇంతవరకు మేకర్స్ అయితే స్పష్టత ఇవ్వలేదు. మరి పరశురాముడి పాత్ర పరిస్థితేమిటో చూడాలి.

కాగా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు